తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు పి.ఎ.సి.ఎస్. అధ్యక్షులు, జనసేన నాయకలు పొప్పుప్పు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం నిడదవోలు నియోగికవర్గం లో పెరవలి, ఉండ్రాజవరం, మోర్త, కానూరు, నిడదవోలు గ్రామాలలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. రంగుల విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలు ముద్దు అనే స్లోగన్ తో గత కొన్ని సంవత్సరాల నుంచి నియోజికవర్గంలో వినాయక మట్టి వినాయక ప్రతిమలను పంచి పెట్టడం జరుగుతుంది, అందులో భాగంగా సోమవారం పంచి పెట్టడం జరిగిందని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజకీయ విషయాల్లోనే కాకుండా దైవ కార్యక్రమాల్లో కూడా తనదైన భక్తి భావం చూపిస్తున్న అన్నవరప్పాడు పి.ఎ.సి.ఎస్. అధ్యక్షులు పొప్పుప్పు నాగేశ్వరరావును పలువురు గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పిండి సూరిబాబు , పొప్పొప్పు శివ , బోడపాటి గణేష్, డేగల అన్నవరం , శిరగం గణపతి ఇతర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


