కబడ్డీ క్రీడాకారుడి ఇతివృత్తమే ‘అర్జున్ చక్రవర్తి’

విశాఖపట్నం: ఆగస్టు 26 (కోస్టల్ న్యూస్)

కబడ్డీలో రాణించడానికి పడిన శ్రమ ఆధారంగా రూపొందించిన వాస్తవగాథ ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రమని హీరో విజయ రామరాజు తెలిపారు. ఈ నెల 29న విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం విశాఖలోని దశపల్ల హోటల్లో చిత్ర బృందం సందడి చేసింది. కథానాయ కుడు విజయ రామరాజు మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇప్పటికే మంచి స్పందన లభించిందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుందన్నారు. అర్జున్ చక్రవర్తి అనే కబడ్డీ ఛాంపియన్ బయోపిక్ ను దర్శకుడు విక్రాంత్ రుద్ర తెరకెక్కించారన్నారు. “అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదు నా తొమ్మిది సంవత్సరాల కల అని అన్నారు. అనంతరం నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ వచ్చాయని. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. ఇటీవల ట్రైలర్ లాంచ్ చేశామని ఆద్యంతం ఆకట్టుకున్న ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింత పెంచిందన్నారు. హీరో విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడన్నారు. అనంతరం పుష్ప2 యాక్ట్ చేసిన దయానంద రెడ్డి మాట్లాడుతూ అర్జున్ చక్రవర్తిగా మైనస్ డిగ్రీల్లో షర్టు లేకుండా విజయరామరాజు నటించాడని. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందన్నారు. గొప్ప థియేట్రికల్ అనుభూతినిచ్చే సినిమా ఇది అని అన్నారు. హీరోయిన్ సీజా రోజ్ మాట్లాడుతూ మా డైరెక్టర్ ఈ సినిమాను నెక్స్ లెవెల్‌లో తీశారని. మా నిర్మాత లేకపోతే ఇంత మంచి సినిమా లేదన్నారు. ఈ సినిమాతో చాలా మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాం అని ఆమె తెలిపారు. యాక్టర్ దుర్గేష్ మాట్లాడుతూ “ఆగస్టు 29న ప్రో కబడ్డీ ప్రారంభమవుతుంది. అదే రోజున నేషనల్ స్పోర్ట్ డే. కబడ్డీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజున రిలీజ్ అవుతుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link