పాలకొల్లులో ఫాస్ట్ డిస్ట్రిక్ట్స్ గవర్నర్స్ ఇన్ కాకరాల వేణుబాబు ఆధ్వర్యంలో 2024 సంవత్సరం గవర్నర్ గా చేసిన కాలంలో
డయాబెటిక్ చైర్ పర్సన్ గా డయాబెటిక్ కిట్స్ జిల్లా అంతటా అందించి, ఉచితంగా అనేక శిబిరాలు నిర్వహించి అనేక మంది నిరుపేదలకు వైద్యసేవలు అందించిన వావిలాల సరళాదేవి కి పాలకొల్లులో అడబాల గార్డెన్ జరిగిన కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లైన్స్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాకరాల వేణుబాబు, నీటిపారుదల శాఖా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా డిస్ట్రిక్ట్ సర్వీస్ అవార్డు వావిలాల సరళా దేవి కి అందజేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ సేవల విషయంలో ఎంతో ముందు ఉందని, లయన్స్ క్లబ్ సేవలను ఆదర్శంగా సమాజంలో అందరూ తీసుకుని తనతో పాటు సమాజ అభివృద్ధి కూడా కృషి చేయాలన్నారు. ఈ వేదిక యందు జిల్లా గవర్నర్ ఎన్.వి.పాపారావు నాయుడు, పూర్వపు గవర్నర్స్ మేకా శ్రీ రామ్ సురేష్, సిహెచ్ సత్య నారాయణమూర్తి, వంకా రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్బముగా అవార్డు గ్రహీత, రాష్ట్ర బీసీ మహిళా నాయకురాలు సరళాదేవి, మంత్రి నిమ్మల రామానాయుడు, లైన్స్ క్లబ్ మెంబర్లకు, నిర్వాహకులకు అభినందనలు తెలియపరిచారు.


