ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి దాతలు ముందుకు రావాలి – రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు

సోమవారం ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలోని వివి గిరి ప్రభుత్వ కళాశాలలో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఒక కోటి రూపాయల దాతృత్వంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శంకుస్థాపనకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి, శంకుస్థాపనలో పాల్గొన్నారు. అనంతరం అదనపు గదుల నిర్మాణానికి ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యను నేర్చుకోవడం ద్వారానే అన్ని రంగాలలో పురోభివృద్ధి ఉంటుందని, ఈ కళాశాలకు మరింత అండగా నిలిచేందుకు ఎల్ఐసి ఒక కోటి రూపాయలు నిధులతో అదనపు గదులు నిర్మాణానికి ముందుకు రావడం వివి గిరి కళాశాలలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థి రుణపడి ఉంటారన్నారు. జి ప్లస్ వన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని మళ్లీ కళాశాలలో ప్రారంభించే నాటికి పూర్తి చేసుకొని తరగతులు నిర్వహించుకోవడానికి అందుబాటులోనికి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరాయంగా కృషి చేయడం జరుగుతుందని, సంకల్పం మంచిదైతే ఏ పనైనా సులువుగా చేయగలమన్నారు. దాతలు నియోజకవర్గ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎల్ఐసి రాజమండ్రి సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహు, దుంపగడప సర్పంచ్ ఎం.విశ్వేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ కె.సుజాత, తహసిల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ లలిత్ కుమార్, డెవలప్మెంట్ ఆఫీసర్ వీర కుమార్, ఏవో ఎస్టేట్స్ రామ్మోహన్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఉప్పుటేరు వద్ద ఆక్రమణల తొలగింపు, పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ కలిసి ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు పరిశీలించారు.

తదుపరి తాడినాడ వద్ద ఉప్పుటేరు ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న చేపల చెరువుల తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

Scroll to Top
Share via
Copy link