కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల పదవులు భర్తీలో భాగంగా ప్రకటించిన సహకార సంఘాల త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారాలు నిడదవోలు నియోజకవర్గం లో ఉండ్రాజవరం మండలం పాలంగి, సూర్యరావుపాలెం, తాడిపర్రు గ్రామాల సహకార సంఘాల త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకారం జరిగాయి. అందులో భాగంగా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం సొసైటీ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాలంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసబ్య కమిటీ చైర్మన్ గా కే. సావరం గ్రామానికి చెందిన డాక్టర్ కాకర్ల నరసన్న (నాని) కమిటీ సభ్యులుగా వడ్డీ దుర్గా ప్రసాద్, కొడమంచిలి ఏసేబు లు ఖరారు అయ్యారు. మండలంలో ఎన్నో రకాల ఊహాగానాల అనంతరం పాలంగి సొసైటీ అధ్యక్షుడు ఎంపిక ఉత్కంఠ లేపింది. 20 రోజుల పాటు సాగిన ఈ చైర్మన్ పదవినీ చివరికి మంత్రి దుర్గేష్ అనుచరునిగా పేరొందిన కాకర్ల నరసన్న(నాని) దక్కించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం అత్యంత వైభవంగా కే. సావరం గ్రామంలో తన ఇంటి నుండి భారీగా తరలివచ్చిన జనసైనికుల ఆనందోత్సాహాల నడుమ ర్యాలీగా పాలంగి సొసైటీ వద్దకు తరలివచ్చారు. తీన్మార్, బాణాసంచా కాల్పులు జరిపి పాలంగి గ్రామదేవత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్న నూతన సొసైటీ కార్యవర్గ సభ్యులు అనంతరం సొసైటీలో పూజలు నిర్వహించి త్రిసభ్య కమిటీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన జనసైనికులు కూటమి నాయకులు నూతన కార్యవర్గ సభ్యులను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను పాలంగి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి ఉదయ్ కుమార్ (భాను), చివటం గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ ముళ్ళపూడి చిన్న వెంకట పాండురంగరావు, మట్టావీరా వెంకట సత్యనారాయణ అబ్బిరెడ్డి శివ సతీష్, చివటం ఎంపీటీసీ వేముల వెంకట సత్యనారాయణ, నిడదవోలు ఏఎంసీ చైర్మన్ గాలింకి చినబాబు, తేతలి సొసైటీ చైర్మన్ మట్టా వెంకట్, పాలంగి గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాస్, కె.సావరం గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణ, మండల జనసేన నాయకులు ఎంపీటీసీ కాకర్ల కరుణాకర్, సాంబశివరావు, ఉండ్రాజవరం గ్రామ జనసేన పార్టీ నాయకులు హనుమంతు వెంకన్న, వంగలపూడి శ్రీనివాస్, బండారు రాము, ఉండ్రాజవరం మండల మానవతా అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాస్, వెలిచేటి బోస్, పశ్చిమగోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు, తణుకు పట్టణ బిజెపి అధ్యక్షులు బొల్లాడ నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందించారు. పాలంగి, కె. సావరం గ్రామాల సొసైటీ సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


