నేతాజీ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం తణుకు మండలం దువ్వ గ్రామంలో స్థానిక నెంబర్ 3 పాఠశాల వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ 80 వ వర్ధంతి సందర్భంగా నేతాజీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తొలుత నేతాజీ చిత్రపటానికి రిటైర్డ్ ప్రిన్సిపాల్ మల్లెల డేవిడ్ పూలమాలలు ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి తణుకు మార్కెట్ యార్డ్ కమిటి ఏ.ఎం.సి. చైర్మన్ కొండేటి శివ ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.టి.సి. పెనుమాక అశోక్ , సిర్రా ధనరాజు, కొడమంచిలి కిరణ్, టి.అప్పలస్వామి, కొడవట్ల వీరయ్య , రాచర్ల ప్రకాష్, టి.సర్వేశ్వరరావు, నూతంగి శ్రీను, చాట్ల రమేష్ , పెనుమాక సిద్దూ, బొబ్బిలి పవన్, ఉండ్రాజవరపు సుధీర్, నారికిమిల్లి ప్రభాకర్, బాదంపూడి శ్రీను, సిర్రా సుజయ్, ఉండ్రాజవరపు వెంకట్రావు, జాలాది రమేష్ తదితరులు పాల్గొన్నారు.


