48 వ వార్డు యోగా అవగాహన ర్యాలీలో వార్డు జనసేన అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఉప్పులూరి

యోగా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందగలుగుతామని 48 వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అన్నారు సోమవారం ఉత్తర నియోజకవర్గం 48వ వార్డు పరిధిలో గల బర్మా క్యాంపు, ఇందిరానగర్, బాపూజీ నగర్, శ్రీనివాస్ నగర్ తదితర ప్రాంతాల్లో యోగ అవగాహన ర్యాలీ చేపట్టి ప్రజలకు యోగ ప్రాముఖ్యత ఆవశ్యకత విశేషాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా వార్డు జనసేన అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఉప్పులూరి మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈనెల 21న 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐదు లక్షల మందితో చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని ప్రపంచ రికార్డు నెలకొల్పే స్థాయిలో కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని విశాఖ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దుర్గాప్రసాద్ ప్రతాప్ నూకరాజు శివ కూటమి నాయకులతో పాటు 271, 272, 273, 276, 277 సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

