జాతీయ లోక్ అదాలత్ లో యెక్కువ కేసులు రాజీ చేయుట

తణుకు కోర్టు భవనముల సముదాయము. ది 10.5.2025 న జరుగు జాతీయ లోక్ అదాలత్ లో యెక్కువ కేసులు రాజీ చేయుట గురించి చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి గారు మరియు మిగతా న్యాయమూర్తుల ఆధ్వర్యములో తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులు తో మీటింగు ఏర్పాటు చేసి, వచ్చే నెల 10 వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడు కేసులు ఎక్కువ రాజీ చేయుట గురించి చర్చించి కక్షీధారులకు ఆమోదయోగ్యంగా కౌన్సెలింగ్ ఇచ్చి కేసులు రాజీ చెయ్యాలని తెలిపారు. ఇప్పటికీ కోర్టులలో పెండింగ్ కేసుల భారం పెరిగిందని దానిని తగ్గించుటకు లోక్ అదాలత్ ఒక మార్గమని తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్ గారు స్పందించుతూ బార్ అసోసియేషన్ ద్వారా ఎక్కువ సివిల్ కేసులు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు 1. చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి K కృష్ణ సత్య లత, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సాయిరాం పొతర్లంక, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ PVN రంజిత్ కుమార్, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ AV నాగ రాజు, బెంచ్ కోర్టు మెజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సూరంపూడి కామేష్, సీనియర్ న్యాయవాదులు కౌర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ హనుమంత రావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు తణుకు టౌన్, తణుకు రూరల్, ఇరగవరం, అత్తిలి, ఉండ్రాజవరం సబ్ ఇన్స్పెక్టర్ లు, మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సత్తి మణికంఠ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link