నిడదవోలు ఆర్టీసీ డిపో ఆధునీకరణకు

నిడదవోలు ఆర్టీసీ డిపో ఆధునీకరణకు శ్రీకారం ప్రజాపోరాటాలు వృధాకావు సామాన్య ప్రజల చిరకాలవాంచ నెరవేర్చుతున్న వేళ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి ప్రజలతరపున కృతజ్ఞతలు తెలియచేసిన “నిడదవోలు ఆర్టీసీ డిపో సాధన సౌకర్యాలపోరాట కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు…. ఒకప్పుడు ఏజెన్సీ కి ముఖద్వారంగా ఉండి జిల్లాలోనే నెంబర్ 1గా నిలిచిన డిపో పాలక వర్గాలు. అధికారుల నిర్లక్ష్యం వల్ల 2006సంవత్సరంలో డిపో మూసివేసిన సంగతి అందరికి తెలిసిందే అప్పటి నుండి సిపిఎం ప్రజా సంఘాలు. ఆటో. రిక్షా సంఘాలు చిన్న చిన్న వ్యాపారసంఘాలు అన్ని కలిసి ఐక్యంగా డిపో సాధన కమిటీ గా ఏర్పడి జువ్వల రాంబాబు కన్వీనర్ గా 9సంవత్సరాలు పాటు ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర అందరికి తెలిసిందే ఆఖరికి అప్పటి ఎమ్మెల్యే గా ఉన్న శ్రీ బూరుగుపల్లి శేషారావు గారి ప్రత్యేక కృషివల్ల 2015లో డిపో పునరుద్ధరించారు. వర్షం వస్తే డిపో నీటిలో మునిగిపోతుంది ప్రజలు బస్సు ఎక్కటం కూడా కష్టసాధ్యం అయ్యేది పక్కా భవనాలతో ఆధునికరించాలని డిమాండ్తో ఉద్యమాలు నడిపారు వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదు ఎట్టకేలకు మంత్రి దుర్గేష్ గారి కృషితో ఆధునికరించబడుతుంది అని రాంబాబు హర్షం వ్యక్తం చేశారు

Scroll to Top
Share via
Copy link