వసతి గృహాల్లో వసతుల కల్పకు ‘కూటమి’ కృషి

సంక్షేమ వసతి గృహాల్లో వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులోని సంక్షేమ వసతి గృహం పునర్నిర్మాణం చేపట్టాలని అందులో భాగంగా క్రీడాస్థలం నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇరగవరం కాలనీలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని శనివారం సందర్శించిన ఎమ్మెల్యే ఆరిలిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. అంతకుముందు వసతి గృహం పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. తణుకు పట్టణంలోని 1987లో నిర్మించిన బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో సుమారు 60 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని చెప్పారు. సంక్షేమ వసతి గృహంలో డైనింగ్‌ హాల్‌ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ వసతి గృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link