మంజూరైన పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి గ్రౌండింగు పనులుపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.
సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ సిఈవో కి చైర్ పర్సన్ ఆదేశాలు.
ఉభయ జిల్లాల జిల్లా పరిషత్తు చైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ
ఉభయ జిల్లాలో అభివృద్ధిలో కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా పరిషత్తు చైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా పరిషత్తు సిఇవో,ఉభయ జిల్లాల అధికారులు,జిల్లా పరిషత్తు సభ్యులతో కలసి చైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ 1 వ,7 వ స్థాయి సంఘాల సమస్యలు, రెండవ విడతగా 2,3,4,5,6 స్థాయి సంఘాలు సమస్యలుపై సమీక్షంచారు.
మొదటిగా వివిధ శాఖల అధికారులు జిల్లాలో మండలాల వారీగా మంజూరైన పనులు, ప్రగతి లో పనులు వాటి వివరాలు, ఇంకా జరగవలసి ఉన్న పనుల వివరాలను వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు చైర్పర్సన్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దశలవా ఒక్కొక్కటి ఇచ్చిన హామీలను నెరవేర్చు తున్నారని అన్నారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించుటకు అందరు సహకారంతో ముందుకు సాగుతున్నామని, అధికారుల పాత్ర కీలకమైనదన్నారు. జిల్లాలో మంజూరైన కొన్ని పనులు పూర్తిచేయని కారణంగా ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్తు సమావేశాలకు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుండి అధికారులు హాజరు కాకపోవడంతో హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా పరిషత్తు చైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ అన్నారు. ఈ సందర్భంగా సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ సిఈవో కు జిల్లా పరిషత్తు చైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్తు సిఇవో కె.భీమేశ్వర రావు, ఉభయ జిల్లాల వివిధ శాఖల అధికారులు, జిల్లా పరిషత్తు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


