తెలుగు నాటక దినోత్సవం, కందుకూరి వీరేశలింగం పంతులు 172వ జయంతి తణుకు కళాకారుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా బి.సి.నాయకురాలు, రాష్ట్ర వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా ఆరిమిల్లి రాధాకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి కళాకారుల ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకునివెళ్ళారు, కళాంజలి రమణ కళాకారులకు భవననిర్మాణం చేయవలసిందిగా కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కళాకారులకు ఏభై సంవత్సరాలకు ఫించన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని, వారి సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం కళాకారులకు ఐదువేల రూపాయలను కళాంజలి రమణ కు అందచేసినారు.
అదేవిదంగా బసవా రామకృష్ణ కళాకారులకు మాట్లాడుతూ కళలకొసం, కళల అభివృద్దికొరకు కూటమి ప్రభుత్వంలో చర్యలు చేపట్టారని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బసవా రామకృష్ణ, మోపిదేవి శంకర్రావు, అకేటి నర్సింహమూర్తి, తణకు AMC చెర్మన్ కొండేటి శివ, వైస్ చైర్మన్ మెహన్, కళాకారులు సిద్దా రామకృష్ణ, దంపూరి దుర్గా ప్రసాద్, రాజు నక్కా రామారావు, రజని తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను అందరినీ ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియచేశారు.


