ప్రస్తుతం వాడే ఎన్నో రకాల రసాయన మందుల వలన భూసారం తగ్గుతుంది, దానితో ఎరువుల వినియోగం వల్ల పెట్టుబడి ఎక్కువడంతో పాటు పంట తక్కువ దిగుబడి వస్తుంది. పచ్చిరొట్ట ఏరువులైన జనుము, జీలుగు, పిల్లి పెసర, అలసంద వంటి పంటలను దాళ్వా పంట తరువాత వేసవిలో పూత వరకు పెంచి ఆ తర్వాత నేలలో కలిపి దున్నడాన్ని పచ్చిరొట్ట ఎరువులు అంటారు కావున రైతులందరు దాళ్వా పంట తరువాత పచ్చి రొట్ట విత్తనాలు జల్లినట్లయితేనేల భౌతిక స్థితి మెరుగుబడి, భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది.
- నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవుల వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది.
- నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగపడతాయి.
- జీలుగు, జనుము, పిల్లిపెసర వంటి పైర్లు వేసినప్పుడు వీటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమిలోపలి పొరల్లో నిక్షిప్తమైన అనేక పోషకాలను తెచ్చి పంటకు అందిస్తాయి.
- పప్పుజాతి పంటల వల్ల రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది.
- పచ్చి రొట్ట పైర్లు ఎరువులగానే కాకుండా పశువులకు మేతకుగాను ఉపయోగపడుతుంది.
. ప్రస్తుతం వ్యవససాయ శాఖ ద్వారా 50 % రాయితీ పై పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగ , పిల్లిపెసర మరియు జనుము రైతులకు అందించడం జరుగుతుంది కావున విత్తనాలు కావాల్సిన రైతులు సంబందిత రైతు సేవా కేంద్రాలలో సంప్రదించవలసినదిగా కోరడమైనది


