దాతలను అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ – పైడిపర్రులో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రస్తుత వేసవి దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి అనేక మంది దాతలు ముందుకు రావడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం తణుకు మండలం పైడిపర్రు 34వ వార్డులో కూటమి నాయకులు జ్యోతికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి దాతృత్వాన్ని చాటుకోవడం అభినందనీయమన్నారు. మనం సంపాదించిన ఆదాయంలో ఎంతోకొంత సేవా కార్యక్రమాలకు వినియోగించి పది మందికి సహాయ పడే విధంగా దాతృత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన దాతలను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


