వీరవాసరం మండలం నౌడూరు సెంటర్లో సిపిఎం కొణితివాడ, ఉత్తర పాలెం, నవుడూరు గ్రామశాఖలు ఆధ్వర్యంలో అమరవీరుడు కామ్రేడ్ కలిదిండి సూర్యనారాయణరాజు స్మారకర్థం వీరవాసరం రోడ్ లో చలివేంద్రం ప్రారంభం. అమరవీరుడు కలిదిండి సూర్యనారాయణరాజు చిత్రపటానికి సిపిఎం నాయకులు జిల్లా నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, ఆకుల హరేరామ్ , లింగం సత్యనారాయణ, ఏళ్లబండి మారినాయడు దండేసి నివాళులర్పించారు. తొలిత ప్రజారాజ్యమండలి నాయకులు షేక్ వల్లి అమరవీరుల పాటపాడారు. చలివేంద్ర సభకు అధ్యక్షత వహించిన సిపిఎం సీనియర్ నాయకులు జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం చలివేంద్రం ప్రారంభిస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతాగోపాలన్ మాట్లాడుతూ పార్టీ ప్రతి సంవత్సరం అమరవీరుడు సూర్యనారాయణరాజు పేరుతో మజ్జిగ చలివేంద్రం నిర్వహించడం అభినందనీయమని సిపిఎం పార్టీ అంటేనే సేవా అని గోపాలన్ అన్నారు. దేశంకోసం ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) మాత్రమేనని అన్నారు. ఓ పక్క ప్రజాసమస్యలపై ప్రజలుపక్షాన పోరాటాలు చేస్తూ మరో పక్కన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అసలు శిష్యులు అయన పార్టీ సిపిఎం అన్నారు. నేడు మతోన్మాదులు ప్రజల్లో ఐక్యతను దెబ్బలు తీసే విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని గోపాలన్ అన్నారు. సిపిఎం నాయకులు ఆకుల హరే రామ మాట్లాడుతూ ప్రజల దాహానికి చలివేంద్ర ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు లింగం సత్యనారాయణ చలివేంద్రం ఎండలు తీవ్రత తగ్గేంత వరకు కొనసాగిస్తామని సత్యనారాయణ ముగింపు మాట్లాడుతూ నౌడూరు గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు కందుల ఆదినారాయణ పేరుతో మజ్జిగ వేయుట వారి కుమార్తె నాగమణి అల్లుడిని అభినందించారు. చలివేంద్రానికి దాదాపు 50 మంది వరకు దాతల ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని సత్యనారాయణ అన్నారు కార్యక్రమంలో హనుమంతుడు మండల కార్యదర్శి కె.ప్రసాద్, కే.పద్మజ, బత్తులవిజయ్, చింతపల్లి తిరుమలరావు, కేతా జ్యోతిబాస్, అయినపూడి బాబురావు, కిలాడి సత్యనారాయణ, ఎం.త్రిమూర్తులు, జుత్తుగ సాంబాయమ్మ, పంపన సూర్యనారాయణ, మంగ నారాయణ రిక్షా కార్మికసంఘం నాయకులు పాల్గొన్నారు.


