బాపట్ల జిల్లా నవతరం పార్టీ అధ్యక్షుడు షేక్ కరీం పుట్టినరోజు సందర్భంగా నిరుపేద మహిళలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.కార్యక్రమంనకు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా హాజరై బియ్యం తదితర ఆహార పదార్ధాలు పంపిణీ చేశారు.బాపట్ల పట్టణం పెదనందిపాడు రోడ్డు బ్రిడ్జిప్రక్కన జరిగినకార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుపేదలకు పంపిణీ చేశారు.ప్రతి సంవత్సరం కరీం జన్మదిన వేడుకలు సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.ఈ సందర్భంగా కరీంను రావు సుబ్రహ్మణ్యం శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాపట్లజిల్లాలో పార్టీ బలోపేతానికి కరీం చేస్తున్న కృషిని గుర్తించి ప్రజలు కరీం ద్వారా అధికారులకు తమ సమస్యలు తెలుపుకోవడం పార్టీ అభివృద్ధికి నిదర్శనం అన్నారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ ప్రధానకార్యదర్శి పల్లం సరోజినీ,తెలుగుయువత నేతలు పల్లం జీవన్, నవతరం పార్టీ నేతలు కోటిపల్లి శ్రీనివాస్, కటకం బంగారు బాబు,గాలం సదాశివబ్రహ్మం, తగరపు సువర్ణలత తదితరులు పాల్గొన్నారు.


