ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సంధర్బముగా ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం నందు అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైధ్యాధికారి డాక్టర్ ఆర్.ఎస్.ఎస్.వి ప్రసాద్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు అనే నినాదం తో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆయన తెలియజేశారు. తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్యం, మనుగడను పెంపొందించడానికి, నివారించదగిన ప్రసూతి, శిశు మరణాల గురించి అవగాహన పెంచడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని , తెలియజేశారు.మరియు ఏ తల్లి జన్మనిస్తూ మరణించకూడదు ఏ బిడ్డ జన్మిస్తూ మరణించకూడదు ..అని తెలియజేశారు. మరియు సరైన వయసులో వివాహం – సంతోషాల నిలయం అని, ఆసుపత్రి ప్రసవాలు – తల్లి బిడ్డకు ఆరోగ్యం ఆనందం. అని, ఆడబిడ్డకు 21, మగ బిడ్డకు 25 వివాహ వయస్సు. అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాగంగా కమ్మ్యూనీటి హెల్త్ ఆఫీసర్, మైలవరపు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గర్భధారణ సమయంలో అధిక-నాణ్యత సంరక్షణ, మహిళలు, శిశువులకు ప్రసవానంతర సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రచారం అవశ్యకతను చెబుతుందని తెలియజేశారు. ప్రభుత్వఆసుపత్రిలో మాత్రమే ప్రసవాలు చేయించండని, పౌష్టికాహారం – తల్లి బిడ్డ ఆరోగ్యానికి సోపానం అని, ప్రభుత్వ సేవల వినియోగం – ఆర్థిక స్వలంబనకు సోపానం అని వ్యక్తిగత పరిశుభ్రత వెయ్యి రెట్లు మేలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమములో పబ్లిక్ హెల్త్ నర్స్ కేడివిఎల్ కుమారి, ఆరోగ్య పర్యవేక్షకులు జీన్నూరి శ్రీనివాస్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ అసిస్టెంట్ లు , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


