తూర్పువిప్పరు గ్రామములో బిజెపి వ్యవస్థాపక దినం సందర్భంగా ముళ్ళపూడి రేణుక వ్యాఖ్యలు
పేదల సంక్షేమమే లక్ష్యంగా, అంత్యోదయ విధానంతో ఏకాత్మక మానవతావాదం ఆచరణగా
ఆర్థిక, సాంస్కృతిక జాతీయవాదమే సిద్ధాంతంగా, సర్వస్ఫర్శి – సర్వవ్యాపిగా దేశవ్యాప్తంగా నలుమూలల విస్తరించి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా, దేశహితం కోసం పనిచేస్తున్న, ప్రతియొక్క కార్యకర్తకి, నాయకులకు, మద్దతుదారులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బిజేపి వ్యవస్థాపకదినంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకురాలు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక. ఈ సందర్భంగా ఆమె ఆదివారం తణుకు నియోజకవర్గం తూర్పువిప్పరు గ్రామములో బిజెపి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్య్రమంలో బిజెపి నాయకులు జిల్లా బిజేపి అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నార్ని తాతాజీ, బోల్లాడ నాగరాజు, రాసబత్తుల అనుకుమార్, పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


