భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం మండలం బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం ఉండ్రాజవరం గ్రామంలో బిజెపి జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షులు కొప్పినీడి బాలాజీ, బిజేపి సీనియర్ నాయకులు బూరుగుపల్లి శివరామకృష్ణ, బూగురుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని బిజెపి వ్యవస్థాపకులు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని పెంపొందించడం కోసం, విలువలు విలువలతో కూడిన రాజకీయాలను చేస్తూ నీతి నిజాయితీ తో ప్రపంచంలోనే ఎక్కువమంది కార్యకర్తలు కలిగి ఉన్న పార్టీ బిజెపి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి సీనియర్ నాయకులు అక్కిన గోపాలకృష్ణ, ఆకేళ్ళ శ్రీనివాస్, పుష్పాల ఏసుబాబు, కోడూరి శ్రీధర్, కారంకి చంద్రం, జీడిగుంట సత్యనారాయణ, పొన్నగంటి మధు కానూరు ఫణీంద్ర, పైపూరి మాణిక్యాలరావు, ఇమ్మన్ని బ్రహ్మయ్య, కాల్దారి రామారావు తదితరులు పాల్గొన్నారు


