కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న రవికుమార్ ను పరామర్శ
బాధిత కుటుంబానికి 10 వేలు రూపాయలను అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
మెరుగైన చికిత్స అందజేయాలని సంబంధిత అధికారులకు తెలిపిన ఎమ్మెల్యే
నోవాటేల్ డౌన్ వద్ద లారీ బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకొని, ఘటన కు గల కారణాలను సంబంధిత అధికారులుకు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా కాకుండా చూడాలని అధికారులకు తెలిపారు. అనంతరం లారీ ప్రమాద ఘటన లో దక్షిణ నియోజకవర్గం దిగువ రెల్లివీధి శబరి నగర్ కు చెందిన తుపాకుల వెంకట రవి కుమార్ ని కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఎల్.రవి కుమార్ ఆరోగ్య పరిస్థితి పై కేజీహెచ్ సూపర్డెంట్ శివానంద ని, సంబంధింత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 10 వేలు రూపాయలను రవికుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు, డాక్టర్లు పాల్గొన్నారు.


