ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి బలపరిచిన అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరం కు అఖండ విజయం చేకూర్చాలని భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు కోరారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పట్టణంలో పట్టణ బిజెపి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుస్తూ మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖరంకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ ఉపాధ్యక్షులు రాసాబత్తుల అనుకుమార్, భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.


