ఎంఎల్ఏ పత్సమట్ల ధర్మరాజు, టిడిపి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ మహేష్ కుమార్.
ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనులో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావుతో కలసి సోమవారం ఎంపీ మహేష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్లి ఉపాధ్యాయులు, విద్యావంతులను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ కు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. బ్యాలెట్ పేపర్ లో మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖర్ కు వేసి గెలిపించాలని కోరారు. విద్యావంతుల తరఫున గళం విప్పేందుకు వీలుగా రాజశేఖర్ కు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టిడిపి బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


