కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశంలో నేతలు వెల్లడి
ఈరోజు రాజమహేంద్రవరం, చెరుకూరి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు, పార్టీ ప్రెసిడెంట్ లు రాష్ట్ర కార్యదర్శులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.


