రాష్ట్రంలో క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారధ్యంలో యువత, విద్యార్థులను ప్రోత్సహించే విధంగా పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. ఆదివారం ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో లక్ష్మి చెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చదరంగం పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్ల రాణించే వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిçస్తుందన్నారు. క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో క్రీడా సౌకర్యాలు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా మెదడుకు పదును పెట్టే చదరంగం క్రీడ విద్యార్థి దశలో మేథస్సును పెంచుతుందని అన్నారు. జ్ఞాపకశక్తితోపాటు విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు చదరంగం దోహదం చేస్తుందన్నారు. ఎంతో మంది చదరంగం క్రీడలో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా చదరంగంలో మంచి ఉన్నత స్థానానికి చేరుకునేలా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడాకారులుగా రాణించాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న చరణ్‌ను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. అంతకుముందు ఎమ్మెల్యే రాధాకృష్ణను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


