ఆస్థి నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం వచ్చేలా కృషి చేస్తాము – తెదేపా 41వ వార్డ్ అధ్యక్షులు ఐతి మధు,రవి బాబు
ఐదవ పోలీసు స్టేషన్ పరిధిలోని జ్ఞానాపురం సెబీష్టియన్ కోలనీ ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. వంటగదిలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగిన వెంటనే ఇంట్లో ఉన్నవాళ్లు బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీ వల్లనే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా అప్పటికే ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, టీవీ, సోఫాతో పాటు వంట సామాగ్రి కూడా పూర్తిగా కాలిపోయినట్లు ఫైర్ అధికారులు తెలియపరిచారు. వెంటనే తెదేపా సీనియర్ నాయకులు బాధితులను పరామర్శించిన ఫ్యాన్ లు లైట్ లు పెయింట్ లు కొంత ఆర్ధిక సహాయం అందించారు. తెదేపా 41వ వార్డ్ అధ్యక్షులు ఐతి మధు, వార్డు వైస్ ప్రేసిడెంట్ రవి బాబు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఆదుకుంటుందని ధైర్యం ఇచ్చి,జరిగిన ఆస్థి నష్టనికి పరిశీలించారు.బాధితురాలు గంగమ్మకు మనోధర్యాన్ని కలిగించి తమకు తోచిన సహాయం చేస్తామని చేస్తామని చెప్పి ప్రస్తుతం కుటుంబం సభ్యులకు ఇబ్బంది కాకుండా ఫ్యాన్, లైట్ లు,హౌస్ వైరింగ్ కిట్టు మరియు ఇంటికి కావలసిన పెయింట్స్,కొంత మేరకు ఆర్ధిక సహాయం చేసామని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.


