వైసిపి కి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైసిపి సమన్వయ కర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆశీలమెట్ట కార్యాలయంలో నూతనంగా నియమితులైన వైయస్సార్సీపి సౌత్ వికలాంగుల విభాగం అధ్యక్షుడు గరికిన చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి పద్మనాభం అమ్మాజీ వాసుపల్లిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సాలువాతో సత్కరించారు. వాసుపల్లి గణేష్ కుమార్ చొరవతో జిల్లా పెద్దలు పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ గత తప్పిదాలు సరిచేసుకుంటూ జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారన్నారు. కూటమిపాలన ఎన్నికల ముందు చెప్పింది ఒకటి చేస్తోంది ఒకటని ఎద్దేవా చేశారు. అధికారం కోసం చేతకాని హామీలు ఇచ్చి చంద్రబాబు మరొకసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించుకున్నాడన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని అటకెక్కించారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే కోట్లాది రూపాయలు సంక్షేమాన్ని ప్రజలకు అందేవన్నారు. అక్క చెల్లెమ్మలకు గాని, నిరుద్యోగులకు, మత్స్యకారులకు మచ్చుకైనా భరోసా కనిపించడం లేదన్నారు. ఇప్పటికే ప్రజలకు కూటమి పాలన తేటతెల్లమయిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా వెనక్కి వెళ్ళిపోయాఅన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు మాటల గారడీలు తప్ప సూపర్ సిక్స్ లో ఒక్క సిక్సు కూడా కొట్టలేరన్నారు. ప్రజల కోరుకునే విధంగా మళ్లీ అధికారంలోకి వైసిపి ప్రభుత్వం వస్తుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు సనపల రవీంద్ర భారత్, సౌత్ మహిళా అధ్యక్షురాలు వాసుపల్లి బంగారమ్మ, 35 వ వార్డ్ అధ్యక్షులు అలుపన కనకరెడ్డి, 42 వ వార్డ్ అధ్యక్షులు బేశెట్టి ప్రసాద్, 30 వ వార్డ్ ఇంచార్జి దస్మాంతుల చిన్ని,రేయి డేవిడ్ రాజ్, మల్ల బుజ్జి, గంగాధర్, అజయ్, గనకాల రామరాజు, చింతకాయల వాసు, చేపల రాజు, దుర్గ తదితరులు పాల్గొన్నారు.


