4వ అదనపు జిల్లా జడ్జి కోర్టు తణుకులో గురువారం జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ ఆదేశముల మేరకు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధ్యవర్తిత్వం మీద కోర్టులు పనిచేయు ప్రతి చోట 90 రోజులు ప్రత్యేక డ్రైవ్ ద్వారా మీడియేషన్ లో కేసులు రాజీచేయుట గురించి జిల్లా జడ్జి డి సత్యవతి మాట్లాడుతూ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు అవగాహన కల్పించి, మధ్యవర్తిత్వంలో ఎక్కువ కేసులు రాజీ చేయుటకు ప్రయత్నించాలని, తద్వారా సమయాన్ని కక్ష దారులకు న్యాయాన్ని సత్వరం చేకూర్చడానికి వీలవుతుందని అన్నారు. అదేవిధంగా ఈ ప్రత్యేక 90 రోజుల డ్రైవ్ గురించి పత్రికలలో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మధ్యవర్తిత్వంలో కేసుల రాజీ గురించి ప్రజలకు సమాచారం అందచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కే. కృష్ణ సత్యలత, సీనియర్ సివిల్ జడ్జి, సాయిరాం పొతర్లంక, జూనియర్ సివిల్ జడ్జి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, న్యాయవాదులు, ట్రెయిన్డ్ మీడియేటర్ లు పాల్గొన్నారు.


