వార్త‌లు

రైతులను నట్టేట ముంచే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం

రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం తణుకులో వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కర్కశముగా వ్యవహరిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చం నాయుడు పట్టించుకోకుండా రైతుల పట్ల హాస్యాస్పదంగా మాట్లాడుతూ వైయస్సార్సీపి ప్రభుత్వంలో రైతుకు విత్తనం నాటే స్థాయి నుండి ధాన్యం చేతికొచ్చే వరకు అన్ని గ్రామంలోనే జరగాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలను గాలికి వదిలేసారని నేడు […]

వార్త‌లు

ఉపాధ్యాయ గురువు సర్వేపల్లికి ఘన నివాళులు

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా శుక్రవారం తణుకు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే ఇవన్నీ తెచ్చిన సర్వేపల్లి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా ఆచరిస్తామని ఆయన స్ఫూర్తితో ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

తణుకు రామకృష్ణ సేవాసమితిలో ఉపాద్యాయ దినోత్సవం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా తణుకు రామకృష్ణ సేవాసమితి వివేకానంద హ్యూమన్ ఎక్స్లెన్స్ సెంటర్ సంయుక్త నిర్వహణలో సజ్జాపురం రామకృష్ణ సేవాసమితిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు డాక్టర్ తాతిన రామబ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తణుకు శాసనసభ్యులు ఆరీమిల్లి రాధాకృష్ణ విచ్చేసి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనదని సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలతో స్ఫూర్తితో ఉపాధ్యాయులు పనిచేయాలని కోరారు. ఈ

వార్త‌లు

వినాయక చవితి మహోత్సవాలలో ఆర్యవైశ్య సంఘం లడ్డూ వేలం పాట

వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా ఉండ్రాజవరం ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో నిర్వహించిన గణేష్ లడ్డు వేలం పాట. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాట కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొని జరిగిన వేలంపాటలో 12 కేజీల బరువు గల లడ్డూను రికార్డ్ స్థాయిలో 13,500 రూపాయలకు దక్కించుకున్న ఇమ్మడి గంగాధర్ కుటుంబ సభ్యులు. లడ్డు దాతలు గ్రంధి రాజా అండ్ బ్రదర్స్ వేలంలో పాడుకున్న లడ్డూను ఇమ్మడి గంగాధర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ

వార్త‌లు

ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చిన “కూటమి” ఉపాధ్యాయ పోస్టులు, భర్తీల విషయంలో పారదర్శకం గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు చిత్రహింసలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తణుకు నియోజవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉత్తమ సేవలు అందిస్తున్న

వార్త‌లు

సొంతూరుకు చేసింది ఏంటి కారుమూరీ..?

బియ్యం అక్రమ రవాణా చేసింది మీరు కాదా అక్రమ మైనింగ్‌ చేసింది కారుమూరి కాదా? తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ ప్రశ్నలు గత అయిదేళ్ల కాలంలో సొంతూరు అత్తిలికి ఏం చేశారో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పాలని తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ ప్రశ్నించారు. అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నామని ప్రకటించిన కారుమూరి కనీసం ఒక్క రోడ్డు అయినా నిర్మించారా అని నిలదీశారు. వైసీపీ అధికారంలో ఉండగా రేషన్‌ బియ్యం

వార్త‌లు

ఎస్.వి.ఎస్. స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తణుకు పట్టణానికి చెందిన ఉపాధ్యాయులుకలగ నాగ వెంకట రామ్ కుమార్,ఇంపల్స్ కాలేజీ ప్రిన్సిపాల్,విభాష్యం కేశవరావుఎస్.వి.ఎస్. ఈ.ఎం. హైస్కూల్ ప్రిన్సిపాల్,మిద్దె సూరిబాబుసన్ షైన్ ఈ.ఎం. హైస్కూల్ కరస్పాంటెడ్,ముద్దన శ్రీనివాస్ రావుగవర్నమెంట్ స్కూల్ టీచర్,సుబ్బారావు గారు ఇండియన్ పబ్లిక్ స్కూల్ టీచర్వీరందరినీ ప్రెసిడెంట్ పవన్ కుమార్ సెక్రెటరీ రామకుమార్ ట్రెజరర్ చోడే

వార్త‌లు

సాహితి సామ్రాజ్యం ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి

సాహితి సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ గురువు శుశ్రోషయే జ్ఞాన సాధనం విద్యార్థుల అభివృద్ధికి విజ్ఞానమని అన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత విశ్రాంత ఉపాధ్యాయులు చోరపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సర్వేపల్లి జన్మదినోత్సవం భారత సమాజానికి ఉపాధ్యాయ దినోత్సవం అని అన్నారు. ఈ సందర్భంగా గురువులకు గురువు సర్వేపల్లి జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించగా పలువురు

వార్త‌లు

ఉండ్రాజవరం గ్రామంలో భారీ అన్న సమారాధన

శ్రీ వినాయక చవితి మహోత్సవముల సందర్భంగా ఉండ్రాజవరం గ్రామం సంత మార్కెట్ వద్ద గల వినాయక మందిరం వద్ద గురువారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమంలో ఉండ్రాజవరం పరిసర గ్రామాల నుండి సుమారు 2000 మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేసి స్వామి ప్రసాదన్న స్వీకరించారని ఈ కార్యక్రమానికి సహృదయంతో విరాళములు ఇచ్చి సహకరించిన దాతలకు కమిటీ సభ్యులు ఆవుపాటి ఆచారి,

వార్త‌లు

సునాద ప్రవీణ కృష్ణారావుకు ఘన సన్మానం

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన గురువారం తణుకు రోటరీ క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వేల్పూరు గ్రామనివాసి సుప్రసిద్ధ నాదస్వర విద్వాన్ శ్రీ కావలి పురపు కృష్ణారావు ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీవీ రేడియో ఆర్టిస్టుగా సువర్ణ సింహతలాట పతాక గ్రహీతగా కూడా సుప్రసిద్ధులు అయిన కృష్ణారావు, అతనితో పాటు సహా వాయిద్యాలలో సహకరించే నిష్ణాతులైన కావలిపురపు సత్యనారాయణ, గుమ్మలూరి వెంకట్రావు, మలపర్తి సాయిబాబా, రౌతు సాయిబాబా వాయిద్య కళాకారులను

Scroll to Top