తణుకు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

 కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన నూతన ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన, లోక్ సత్తా అధ్యక్షుడు, డా.జయప్రకాశ్ నారాయణకు సభికులందరూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తణుకు రోటరీ క్లబ్ గత సంవత్సరం సాధించిన విజయాలు, యీ సంవత్సరం వేసుకొన బృహత్ ప్రణాళిక విని సంతోషించారు. వివిధ పాఠశాలకు మంచినీటి సౌకర్యం, విద్యాఖివృదిధికి సమాజసేవకు పోలియో నిధిసేకరణ, సభ్యుల సంఖ్యను పెంచినందుకు బెస్ట్ క్లబ్ అవార్డ్ సాధించినందుకు అభినందించారు. వివిధ శాఖల్లో 26 అవార్డులు సాధించడం జరిగింది.
డా.జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ గతంలో తాను, జిల్లా కలక్టర్ గా  పనిచేసిన రోజుల్లో రొజుకు 1000 మంది పోలియో బారిన పడుతుండే వారని, రొటరీ క్లబ్ నడుము బిగించి మరీ పొలియో వ్యాధిని పారద్రోలడంలో ప్రముఖ పాత్ర వహించిందన్నారు.
ప్రభుత్వం, ప్రతి విద్యార్థి మీద మీద సంవత్సరానికి లక్ష తక్కువ కాకుండా ఖర్చుపెడుతుందని, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరిగి సంపద వృద్ధి చెందింది అన్నారు.  ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలగర వెంకటకృష్ణ కఠారి సిద్ధార్థ రాజు, యు.పవన్ కుమార్ రాజు, ఏ.మస్తాన్ రావు, పోతుల శ్రీనివాసరావు,  పుట్ట రామచంద్రరావు, రొ.నందిగం సుధాకర్, రొ. డా. కె. సత్యనారాయణరాజు, రొ.వి.పార్వతమ్మ, రొ.అక్కిన కాశీవిశ్వనాధం, రొ. డా॥ శ్రీనివాస, మేడికొండ వెంకటేశ్వరరావు, రొ. మల్లిన అరుణ సారథి, రొ. ఆకుల శేషుబాబు, రొ.బసవ రామకృష్ణ, రొ.రెడ్డి రంగారావు, రొ.యర్రంశెట్టి బాబూరావు, రొ.దినేష్ ప్రభృతులు పాల్గొన్నారు. రొ.వి.వి. హనుమంతరావు, రొ.అతికాల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link