పొక్సో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి

పొక్సో చట్టం పై అవగాహన కొరకై బాలబాలికలకు తణుకు, సజ్జాపురం రామకృష్ణ సేవా సమితియందు శనివారం రాష్ట్రన్యాయ సేవల సంస్థ, అమరావతి ఆదేశముల మేరకు రెండవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీమతి కే. కృష్ణవేణి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వేసవి శిక్షణశిబిరంలో శిక్షణ పొందుచున్న విద్యార్ధిని/ విద్యార్ధులకు పొక్సో చట్టం పై అవగాహన కల్పిస్తూ మాట్లాడినారు. అపరిచితులు, పరిచయం లేని వారు ఇచ్చే బహుమతులు, మాటలు నమ్మకూడదని, కొన్ని ముఠాలు పిల్లలకు మాయమాటలు చెప్పి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, రక్తసంబంధీకులు కూడా చిన్న పిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్నారని అన్నారు. తణుకు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.వి. సత్యనారాయణ మాట్లాడుతూ అలాంటి బాధితుల రక్షణ కోసం పొక్సో చట్టం వచ్చిందని, పిల్లలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలని, పిల్లల్ని ఎవరైనా భయపెట్టిన, వారికి ఇష్టం లేకపోయినా వారిని టచ్ చేయాలని చూసిన మొదటగా గట్టిగా ఆరవాలని, తల్లితండ్రులకు చెప్పాలని, లేక చైల్డ్ లైన్ 1098 కు తెలియ చేయాలని, 14 సంవత్సరాల లోపు పిల్లలు చదువుకోవాలని, బాల కార్మికులు గా, బాల్య వివాహాలు చేసుకో రాదని తెలుపుతూ, పొక్సో చట్టంలో శిక్షలు చాలా కటినంగా ఉన్నాయని, బెయిలు కూడా రాదని తెలియచేశారు. అదేవిదంగా రామకృష్ణ సేవాసమితి ప్రెసిడెంట్ భోగవల్లి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకుని సమాజానికి పనికి వచ్చే పౌరులుగా తయారుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రెండవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, తణుకు శ్రీమతి కే. కృష్ణవేణి, న్యాయవాదులు కుమారి ఎస్.కే. మోథీ, కౌరు వెంకటేశ్వర్లు, చైల్డ్ సైకియాట్రిస్ట్ డా.ఎన్. క్రిష్ణారెడ్డి, ఐ.సి.డి.ఎస్. సూపర్వైజర్ శ్రీమతి పి. మహాలక్ష్మి, తణుకు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.వి. సత్యనారాయణ, రామకృష్ణ సేవాసమితి ప్రెసిడెంట్ భోగవల్లి శ్రీమన్నారాయణ, సెక్రటరీ శ్రీ రామకృష్ణ, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.కే. అలీ ఖాన్ భాజీ, బి.వి. రామనారాయణ, పారా లీగల్ వాలంటీర్ లు శ్రీమతి కే.నాగ మల్లీశ్వరి, కాకర్ల నరసన్న, దూలపల్లి బ్రహ్మాజీ, జి. అజోర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link