ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి
114 మంది యువతులకు ఉచితంగా హెచ్ పీ వీ వ్యాక్సినేషన్
క్యాన్సర్ నివారణ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి పేర్కొన్నారు. ఆదివారం సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిమ్మగడ్డ ఆసుపత్రి ఆవరణలో 114 మంది యువతులకు గర్భాశయం క్యాన్సర్ నివారణకు హెచ్ పీ వీ వ్యాక్సిన్ మొదటి డోస్ ను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కృష్ణ తులసి మాట్లాడుతూ ప్రపంచానికి సవాలు విసురుతున్న క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. హెచ్ పి వి వ్యాక్సినేషన్ ద్వారా ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఇందుకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆర్థిక సాయం చేయడం అభినందనీయమని చెప్పారు. పుట్ట విజయశ్రీ, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు, పూర్వ జిల్లా గవర్నర్లు లయన్ మాదిరెడ్డి బాబూజీరావు, లయన్ దామెర రంగారావు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు లయన్ ఎ.రాజు అధ్యక్షత వహించగా కార్యదర్శి లయన్ ఎ. వెంకటేశ్వరరావు అతిధులకు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలకగా , కార్యక్రమం ఆద్యంతం క్లబ్ సభ్యుల సహకారం తో విజయవంతం చేశారు. తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ ఆసుపత్రి వైద్యబృందం డాక్టర్ N. ప్రదీప్ కుమార్, Dr. నీహారిక, Dr. G. బాలసుబ్రమణ్యమ్ మరియు ఆసుపత్రి సిబ్బంది పూర్తి సహకారం మరియు లయన్ పుట్టా రామచంద్రరావు, లయన్ బాలాజీ లయన్ కొరిపల్లి సత్యనారాయణ అన్ని ఏర్పాట్లలో ఎంతో సహకరించినందుకు ప్రోగ్రాం కోఆర్డినేటర్ పుట్టా విజయశ్రీ కృతజ్ఞతలు తెలియజేశారు.



