పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం తణుకు పట్టణంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, ఆదిశక్తి స్వరూపిణిగా, అహింసను పరమధర్మంగా ఆచరించి ఆత్మగౌరవం కోసం ఆత్మత్యాగం చేసిన మహోన్నత దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారని కొనియాడారు. సమాజంలో ధర్మాన్ని నిలబెట్టే శక్తిగా, స్త్రీల గౌరవాన్ని కాపాడే జగజ్జననిగా ఆమెను అభివర్ణించారు.
వాసవి అమ్మవారిపై ఉన్న అపారమైన గౌరవంతో పెనుగొండ క్షేత్రానికి “వాసవి పెనుగొండ”గా నామకరణం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని తెలిపారు.
అలాగే, ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమం మరియు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ రథోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి బోధనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకాలని పేర్కొంటూ, జయంతి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.



