చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదీ

సాగునీటి భద్రతపై అధికారులు సమన్వయంతో ఉండాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

జలధార–జలహారతి పథకంపై సమీక్ష సమావేశం

           ***

తణుకు నియోజకవర్గంలోని చెరువులను పరిక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదీ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ‘జలధార–జలహారతి’ పథకంలో భాగంగా నీటి సాగు – నీటి భధ్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక కూటమి కార్యాలయంలో అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల నీటి సాగు – నీటి భద్రత మండల కమిటీ సభ్యులతో గ్రామ స్థాయిలో గుర్తించిన పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాలలో గుర్తించిన కెనాల్, డ్రైన్స్‌ పనులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో అంచనాలు ప్రతిపాదించాలన్నారు. ఉపాధి కూలీలతో ‘జల ధార – జల హారతి’ 100 రోజుల కార్యక్రముం ద్వారా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఉన్న చెరువుల పూర్తి వివరాలు తెలుసుకొని ప్రస్తుతం పూడికతీత పనులు చేపట్టుటకు అనుగుణంగా ఉన్నవాటిని గుర్తించాలన్నారు. ఈ ‘జల ధార జల హారతి’ 100 రోజుల కార్యక్రముము ద్వారా పనులు పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని చెరువుల భౌతిక పరిస్థితులను వారం రోజులలో నివేదిక సమర్పించాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో జులై 2026 నుండి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గుర్తించి అన్ని రకాల ప్లాంటేషన్‌ పనులకు ఇప్పటినుండే పూర్తి స్థాయిలో గ్రామాలలో అవసరమగు పనులను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయవలసినదిగా ఆదేశించియున్నారు. సదరు సమావేశమునకు అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, నీటి సాగు – నీటి భద్రత మండల స్థాయి కమిటీ సభ్యులు, ఎన్‌ఆర్‌జీఎస్‌ సిబ్బంది, ఇరిగేషన్‌ సిబ్బంది హాజరయ్యారు.

Scroll to Top
Share via
Copy link