క్షయ వ్యాధి పూర్తినిర్ములనే “ముక్త్ భారత్ అభియాన్”లక్ష్యం

: డాక్టర్ ఎన్ .వసుంధర జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి,

2030 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా భారతదేశం నుండి నిర్మూలించడమే టిబి ముక్త్ భారత్ అభియాన్ ప్రధాన లక్ష్యంగా జిల్లాలో వైద్య సిబ్బంది కృషి చేయాలని అదనపు డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎన్ .వసుంధర సూచనల మేరకు మంగళవారం భారత్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరాన్ని పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించినట్లు ఎస్ టి ఎస్ వి.ఆశాజ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు గా క్షయ లక్షణాలను అనుమానితులుగా గుర్తించి 80 మందికి ఏఐ ఆధారిత ఎక్స్రే పరీక్షలు నిర్వహించామని ఎస్ టి ఎస్ వి .ఆశాజ్యోతి తెలియజేశారు, ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. జయమని మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహనకల్పించడం ద్వారా వ్యాధి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చు అని తెలిపారు,

ఈకార్యక్రమంలో డాక్టర్ డాక్టర్ కే. హేమ రాజు,
టీబీ ల్యాబ్ సూప ర్వైజర్ భీమరాజు మరియు
యమ్ యల్ హెచ్ పి లు, పి స్నేహ, పి అను,
హెల్త్ అసిస్టెంట్ లు వి రాజశేఖర్, ఏ ప్రేమ్ కుమార్ , ఏఎన్ఎంలు కే చిన్నారి, శేష్ కుమారి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link