తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్ష
ముక్కు సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఆదివారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యం ప్రజా సంబంధిత కార్యకలాపాల్లో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ కొద్ది రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు చెప్పారు. త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో రాష్ట్ర పరిపాలన సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు.


