నిడదవోలు – దువ్వాడ రైల్వే లైన్ విస్తరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

రైల్వే విస్తరణతో నిడదవోలు ముఖచిత్రం మారబోతోంది: మంత్రి కందుల దుర్గేష్

భారత్ మాల ప్రాజెక్టును నిడదవోలు, కొవ్వూరు మీదుగా చేపట్టాలని మంత్రి దుర్గేష్ వినతి

నిడదవోలులో రైళ్ల నిలుపుదల కోసం ప్రత్యేక కృషి చేస్తున్నాం – మంత్రి దుర్గేష్ స్పష్టీకరణ

ఆర్యవైశ్యులకు వీరభద్రరావు చేసిన సేవలు చిరస్మరణీయం: మంత్రి కందుల దుర్గేష్

పచ్చిపులుసు వీరభద్రరావు చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి దుర్గేష్

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్తులూరి శ్రీనివాస్ ను పరామర్శించిన మంత్రి దుర్గేష్

నిడదవోలు:నిడదవోలు – దువ్వాడ మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నిడదవోలులో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు.

పచ్చిపులుసు వీరభద్రరావుకు ఘన నివాళి:

ఇటీవల స్వర్గస్తులైన నిడదవోలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పచ్చిపులుసు వీరభద్రరావు సంతాప సభలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ సభలో వీరభద్రరావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వీరభద్రరావు అందించిన సహకారం, ఆత్మీయత మరువలేనివి. ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఆయన నిస్వార్థంగా చేసిన కృషి ఎందరికో ఆదర్శం.భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు, నాయకత్వ పటిమ ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని కొనియాడారు.

రైల్వే అభివృద్ధి & భారత్ మాల ప్రాజెక్టు:

నిడదవోలు ప్రాంత అభివృద్ధిపై మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రైల్వే లైన్ల విస్తరణతో ఈ ప్రాంత ముఖచిత్రం మారబోతోందన్నారు. అలాగే భారత్ మాల ప్రాజెక్టును తాడేపల్లిగూడెం నిట్ నుండి నిడదవోలు, కొవ్వూరు మీదుగా నిర్మిస్తే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం మరియు ఎంపీ పురందేశ్వరిలకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. నిడదవోలు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు అద్భుతంగా సాగుతున్నాయని, రైళ్ల హాల్టింగ్ సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.

బాధిత రైతుకు పరామర్శ:

అనంతరం మంత్రి దుర్గేష్ రాజమండ్రిలోని సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లారు. పొలంలో వరి కోత సమయంలో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న కంసాలిపాలెం గ్రామస్థుడు, మాజీ నీటి సంఘం అధ్యక్షులు అత్తులూరి శ్రీనివాస్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించి, మెరుగైన వైద్యం అందించాలని సూచిస్తూ శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Scroll to Top
Share via
Copy link