గుంతలు లేని రోడ్లు అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యం

కూటమి అధికారంలోకి వచ్చాక రోడ్లు నిర్మాణంపై దృష్టి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

రూ. 3.80 కోట్లతో మంచిలి- కంచుమర్రు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

           ***

రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు నిర్మాణపై దృష్టి సారించి ఇప్పటివరకు సుమారు రూ. 8 వేల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అత్తిలి మండలం మంచిలి నుంచి కోరుకొల్లు వరకు సుమారు రూ. 3.80 కోట్లు వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. మంచిలి నుంచి కంచుమర్రు, స్కిన్నెర పురం, చలివేంద్రచెరువు, కోరుకొల్లు గ్రామ ప్రజలకు ఈ రోడ్డు నిర్మాణం ద్వారా ఉపశమనం కలుగుతుందన్నారు. తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల కాలంలోనే ఆర్ అండ్ బి రోడ్లు దాదాపు 70 శాతం నిర్మాణం చేసుకున్నినామని చెప్పారు. రాబోయే రోజుల్లో 100 శాతం నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో అనేక రోడ్లు పూర్తి నిర్లక్ష్యం చేసి వైసీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, గ్రామీణ రోడ్లు నిర్మాణాలను పూర్తిచేసే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పారు. పెట్టుబడులు తీసుకురావడంలో పరుగులు పెడుతూ ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ సిబిఎన్ అనే మూడు అక్షరాలతో పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link