100 రోజులు టి.బి. స్క్రీనింగ్ సకాలంలో పూర్తి చేయాలి

ప్రస్తుతం జిల్లాలో అమలవుతున్న 100 రోజుల హై రిస్క్ టిబి స్క్రీనింగ్ కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు వైద్యా ఆరోగ్యశాఖ ఆధికారి డాక్టర్ ఎన్. వసుంధర పేర్కొన్నారు. బుధవారం ప్రస్తుతం అమలవుతున్న వందరోజుల హై రిస్క్ టిబి స్క్రీనింగ్ కార్యక్రమం భాగంగా చాగల్లులో నిక్షయ్ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ వసుంధర మాట్లాడుతూ నిడదవోలు టి.బి. యూనిట్ లో ముందుగా గుర్తించిన హైరిస్క్ గ్రామాల్లో 14 సం లోపు వారిని మినహాయించి మిగిలినవారు అందరినీ టిబి స్క్రీనింగ్ చేయాలనీ చెప్పారు. టి.బి. అనుమానితులకు విధిగా నాట్ పరీక్షలు, ఛాతి ఎక్సరే తీయాలి అని చెప్పారు. జిల్లాకు మూడు అధునాతన ఎక్సరే మిషన్ మంజూరు కానున్నాయని తెలిపారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అవార్డ్ అందుకున్న సందర్భంగా డాక్టర్ వసుంధరను చాగల్లు వైద్యధికారి డాక్టర్ తనూజ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తనూజ, డాక్టర్.మనోజ్, టి.బి. సూపర్ వైజర్ ఆర్.పోతురాజు, రత్నకుమారి, టి.బి.హెచ్.వి. సమీరా తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link