చేనేతల జీవితాల్లో “కూటమి” కొత్త వెలుగులు

నేతన్నలకు విద్యుత్తు రాయితీ కల్పించిన ప్రభుత్వం

నియోజకవర్గంలో 116 మందికి చేకూరనున్న లబ్ది

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

వేల్పూరులో పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న విద్యుత్ రాయితీ పథకాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. సాధారణ మగ్గాలు వినియోగించే చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలు వినియోగిస్తున్న వారికి 500 యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుల వృత్తులు చేసుకునే వారికి వారి జీవన విధానం మెరుగుపరిచే విధంగా అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను దశలవారీగా ప్రతి వర్గానికి అమలు చేసే విధంగా ముందుకు వెళుతుందని చెప్పారు. అందులో భాగంగానే చేనేతలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తణుకు నియోజవర్గంలో 116 మంది లబ్ధిదారులకు ఉచిత విద్యుత్తు అందించే విధంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ద్వారా దాదాపు లక్ష మంది లబ్ధిదారులకు పైగా ప్రయోజనం పొందే విధంగా ప్రతి ఏడాది రూ. 150 కోట్లు ఇందుకు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని అన్నారు. విద్యుత్తు బిల్లుల భారం తగ్గించి చేనేత కార్మికుల ఆదాయం పెంచే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం సైతం చేనేతకు చేయూతనిస్తూ ఆప్కో సంస్థ నుంచి ఎన్నో రాయితీలు కల్పిస్తూ మంగళగిరి చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించే విధంగా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో చేనేతలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link