మంత్రి కందుల దుర్గేష్ కృషితో రైతన్నల దశాబ్దాల కల సాకారం..

కాల్దరి – చిలకపాడులో రూ.92.50 లక్షలతో 1.2 కి.మీల పుంత రోడ్డు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు

మంత్రి దుర్గేష్ చొరవపై రైతాంగం హర్షం

నియోజకవర్గ వ్యాప్తంగా 42 పుంత రోడ్ల ఆధునీకరణ చేస్తామని వెల్లడి

నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కాల్దరి చిలకపాడు బీటీ రోడ్డు నుండి మొండి కాల్వ (రైల్వే ట్రాక్) వరకు 1.2 కిలోమీటర్ల మేర పుంత రోడ్డు నిర్మాణానికి రూ.92.50 లక్షల నిధులతో పరిపాలన అనుమతులు మంజూరు చేయించారు.గత ప్రభుత్వ హయాంలో సరైన మరమ్మతులు, నిర్వహణ లేక ఈ పుంత రోడ్లు ఛిద్రమై బురదమయంగా మారి, రైతులు పొలాలకు వెళ్లాలన్నా, కూలీలు పనులకు వెళ్లాలన్నా నరకయాతన అనుభవించేవారని, ముఖ్యంగా పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించే సమయంలో ట్రాక్టర్లు కూరుకుపోయి ప్రమాదాలు జరుగుతుండేవని మంత్రి దుర్గేష్ తెలుసుకొని వెంటనే సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలో మంత్రి దుర్గేష్ యుద్ధప్రతిపాదికన నిధులు మంజూరు చేయించడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ “వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్న రైతుల కష్టాలను నేను స్వయంగా చూశాను. నియోజకవర్గంలో మొత్తం 42 పుంత రోడ్లను గుర్తించి వాటిని ఆధునీకరించాలని నిర్ణయించాం. ఇప్పటికే ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పనులు చేపడుతున్నాం. విత్తనం వేసే సమయం నుండి పంట చేతికి వచ్చే వరకు రైతులు సాఫీగా ప్రయాణించేలా మార్గం సుగమం చేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు

Scroll to Top
Share via
Copy link