నిడదవోలు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం 20వ వార్డు నందు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ఇంటింటికి స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా కృషి జరుగుతోందని మంత్రి తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, తదితర లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Scroll to Top
Share via
Copy link