త్వరలో లబ్ధిదారులకు పూర్తి చేసి టిడ్కో ఇళ్లు పంపిణీ
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
తణుకులో గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సోమవారం తణుకులో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణం గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో 2.50 లక్షల మంది సొంత గృహ నిర్మాణం పూర్తిచేసే గృహప్రవేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. తణుకు నియోజకవర్గంలో ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో సొంత స్థలం ఉన్నవారికి 106 మందికి రూ. 2.50 లక్షలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. 15వ వార్డులో నందం శ్రీనివాసరావు, అనురాధ దంపతుల ఇల్లు గృహప్రవేశం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే 80 శాతం వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో పేదల ఇళ్లకు సంబంధించి రూ. 1.80 లక్షలు మాత్రమే పి ఎమ్ ఏ వై కింద శాంక్షన్ ఇచ్చిన పరిస్థితి ఉండేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మరో రూ. 50 వేలు అదనంగా కలిపి అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల నెరవేర్చే విధంగా కబటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసి మధ్యలోనే నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వారికి సైతం ఉపశమనం కల్పించే విధంగా ఇళ్లను తిరిగి పునఃప్రారంభించి లబ్ధిదారులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


