ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎలాంటి రాజీపడేదిలేదు   

నిడదవోలు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుప్రియ 

ఆహారభద్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపద్యంలో నిడదవోలులో గురువారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో స్థానిక గణపతి సెంటర్‌లోని శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా రెస్టారెంట్‌లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, వాడుతున్న నూనెలు, నిల్వ విధానాలు, పరిశుభ్రత పరిస్థితులు ఆమె సమగ్రంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని ఆహార పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరించి, వాటిని ల్యాబ్ పరీక్షల కోసం పంపిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుప్రియ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎలాంటి రాజీపడబోమని స్పష్టం చేశారు. ఆహార పదార్థాలు కల్తీ, నాణ్యత లోపాలు గుర్తించిన పక్షంలో సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇలాంటి తనిఖీలు పట్టణంలో నిరంతరం కొనసాగుతాయని, హోటల్ యజమానులు పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలు కూడా నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే వినియోగించాలని, ఏదైనా అనుమానాస్పద అంశాలు గమనించినట్లయితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.

Scroll to Top
Share via
Copy link