న్యాయసేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయసహాయం

ఉమ్మడి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎస్. శ్రీదేవి, గురువారం తణుకు సబ్ జైల్ ను సందర్శించి అందులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహారవసతి వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయసహాయం గురించి తెలియచేస్తూ, ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే న్యాయ సేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని, అందరూ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా జడ్జితో పాటు న్యాయసేవల సంస్థ జిల్లా సెక్రటరీ శ్రీ కే. రత్నప్రసాద్, తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ పి.వి.ఎన్. రంజిత్ కుమార్ మరియు ప్యానెల్ న్యాయవాదులు ఎస్. లాజరు, రిమాండ్ అడ్వకేట్ శ్రీమతి ఎం.రామజ్యోతి, పారాలీగల్ వాలంటీర్ కాకర్ల నరసన్న, జైలు సూపరింటెండెంట్ జి. మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link