సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేద హాస్పిటల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్య సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాలలో రోజురోజుకీ పురోగతి సాధిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా నేటి మహిళ అనే అంశంపై సదస్సు నిర్వహించి పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం ప్రఖ్యాత ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ రెడ్డి వేదవతిని, సీనియర్ నర్స్ వలల కోమలిని, గృహిణి పెదపాటి సునీతను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత ఎముకల స్పెషలిస్ట్ రెడ్డి జ్యోతి కృష్ణ, మేనేజ్మెంట్ స్టాప్ అడబాల మణికంఠ ఆసుపత్రి సిబ్బంది వరద సతీష్ కుమార్, పి. ఏసురత్నం, ఏ.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.


