మహిళా దినోత్సవ సందర్భంగా తణుకు శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్, గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీ గ్రంథాలయం నందు తణుకు సుప్రసిద్ధ సంగీత గాయకురాలు శ్రీమతి భమిడి కమలాదేవికి, ఇటీవల కాలంలో చక్కని సోషల్ వర్క్స్ తో సమాజంలో తనకంటూ ఒక శైలీతో ముందుకు సాగుతున్న వి.ఆశాజ్యోతి ని లైన్స్ క్లబ్ గ్యాట్ మెంబర్ అయిన వావిలాల సరళాదేవి, తారకపురి క్లబ్ సభ్యులు డైరెక్టర్ వావిలాల వెంకట రమేష్, సెక్రెటరీ ఎన్.వి.రాంకుమార్, ఎం. జ్యోతి రమేష్, గుప్తా గ్రంథాలయం కమిటీ సభ్యులు సప్పరాజు, చీకటి శ్రీనివాస్, నక్క రామారావు తదితరులు వీరిని సాలువా మెమొంటో పూలకుండీలతో సన్మానించారు .
అనంతరం సరళాదేవిని లైన్స్ క్లబ్ నెంబర్స్, గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు, లైబ్రరీయన్ గుత్తికొండ కృష్ణారావు, అసిస్టెంట్ పృద్వి, కళాంజలి సంస్థ రమణి, కళాకారులు, ఆర్టిస్ట్ రాజు, సినీ సంగీత గాయకులు సరళాదేవి సాశాలువాలతో పూలమాలలతో సత్కరించుకుని అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ మహిళల శక్తి అనంతమని ద్వాపరయుగంలోనూ సత్యభామ వంటి వారు యుద్ధాలు చేశారు, కలియుగంలోనూ రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారు యుద్ధాలు చేసి మహిళలు వీరవంతులుగా ఖ్యాతిగాంచారు ప్రస్తుత కాలంలో ముర్ము వంటి వారు రాష్ట్రపతిగా కొనసాగుతూ భూమి నుంచి అంతరిక్షం వరకు మహిళలు తమ ఖ్యాతిని నలువైపులు చాటుకుంటూ ప్రపంచమంతా మహిళ లేనిదే శూన్యం అనే స్థాయిలో ప్రపంచం మారిందని అన్నారు.
ఈ సందర్భంగా మహిళలు మహిళలకు సన్మానం కాకుండా మా లైన్స్ క్లబ్ సభ్యులు అభివృద్ధి కమిటీ సభ్యుల్లో ఉన్న సోదరులు ఈ విధంగా మాకు సన్మానించడం ఆనందదాయకమని మాపై ఉన్న అభిమానాన్ని మహిళా దినోత్సవం రోజున ఈ విధంగా చాటినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలతో ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కమలాదేవి ఆమె జీవితంలో ఏ విధంగా ఎదిగారు అన్నది తెలియజేశారు, ఆశాలత అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


