ఇరగవరం మండలంలో కత్తవపాడు ఎంపిటిసి మల్లిడ నాగ వెంకట సత్యనారాయణ, ఇరగవరం ఎంపిటిసి చీలి మెంటరాజు ఉపాధ్యక్షులు ఇరువురు రాజీనామా చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్, విజయవాడ మరియు జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అథారిటీ, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం ఆదేశాల మేరకు గురువారం ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశమందిరం నందు ప్రిసైడింగ్ అధికారి మరియు డివిజనల్ అభివృద్ధి అధికారి,తాడేపల్లిగూడెం వారి అధ్యక్షతన ఇరగవరం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఆకస్మిక ఎన్నికలు నిర్వహించారు.
ఆకస్మిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశమునకు 19 ఎంపిటిసి సభ్యులకు గాను 15 మంది సభ్యులు హాజరయ్యారు, సదరు ఎన్నికల్లో సభ్యులు ఇరగవరం 2 ఎంపిటిసి సభ్యులు మంగెన వెంకట రామ నాయుడు ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగెన వెంకట రామ నాయుడు మండల పరిషత్ ఉపాధ్యక్షునిగా ఎన్నిక అయినట్టు ప్రిసైడింగ్ అధికారి ధృవీకరించగా నూతనంగా మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మంగెన వెంకట రామ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశములో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, ఎంపిటిసి సభ్యులు, జెడ్‌పిటిసి పంపన అంజిబాబు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.


