నిడదవోలులో జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

పట్టణంలోని వీధి వ్యాపారులు, చిరువ్యాపారుల వద్దకు వెళ్లి పార్టీ సభ్యత్వాలను స్వయంగా నమోదు చేసిన మంత్రి దుర్గేష్

ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడాలని, సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచన

జనసేన సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల బీమా భరోసా – ప్రీమియంను తగ్గించామని వెల్లడి

పర్యాటక మంత్రిగా వచ్చిన అవకాశంతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో నిడదవోలుకు చోటు కల్పించాని స్పష్టం

18 నెలల కాలంలోనే రాష్ట్ర పర్యాటక రంగంలో రూ.20,088 కోట్ల పెట్టుబడులు సాధించామని వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్

నిడదవోలు:నిడదవోలు క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఘనంగా ప్రారంభించారు. స్వయంగా పోర్టల్‌లో లాగిన్ అయి ఉద్యమి సభ్యత్వాన్ని నమోదు చేసిన మంత్రి దుర్గేష్, అనంతరం పట్టణంలోని వీధి వ్యాపారులు, చిరువ్యాపారుల వద్దకు వెళ్లి పార్టీ సభ్యత్వాలను నమోదు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..

సభ్యత్వం – సామాజిక భరోసా:

“జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నేటి నుండి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. సభ్యత్వం పొందిన వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే పార్టీ తరపున రూ.5 లక్షల బీమా అందిస్తున్నాం. గతంలో రూ.500 ఉన్న ఇన్సూరెన్స్ ప్రీమియంను ఈ ఏడాది రూ.400కు తగ్గించాం. ఈ వ్యత్యాసాన్ని భరించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధులనుండి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. గతేడాది 14 లక్షల సభ్యత్వాలు చేయగా, ఈసారి అంతకంటే భారీగా నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

నిడదవోలు అభివృద్ధికి పెద్దపీట:

నిడదవోలు నియోజకవర్గ పారిశుద్ధ్య మెరుగుదల కోసం ఉడా నుండి రూ.కోటి మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు’లో నిడదవోలును అంతర్భాగం చేశాం. శెట్టిపేటలో బోటింగ్, కోట సత్తెమ్మ తల్లి ఆలయ వద్ద వసతి గృహ నిర్మాణం వంటి పనులు గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పర్యాటక ప్రగతికి నాంది పలికాం:

రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి కేంద్ర సహకారం మెండుగా ఉందని తెలిపిన మంత్రి దుర్గేష్ .. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించామన్నారు. దీనివల్ల గత 18 నెలల్లోనే రూ.20,088 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, తాజ్, మేఫేర్, అట్నోస్పియర్ కోర్ వంటి దిగ్గజ హోటల్స్ రాష్ట్రానికి వచ్చాయన్నారు. గండికోట, సూర్యలంక బీచ్, అహోబిలం, అన్నవరం, బొర్రా గుహలు వంటి పర్యాటక ప్రాంతాలను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు.2027 నాటికి పర్యాటక ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు.

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం:

ఫిబ్రవరి 26 నుండి మార్చి 10 వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదులో జనసైనికులు, వీరమహిళలు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకం కావాలి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పని చేయాలి. పదవులు పొందిన వారు మరింత బాధ్యతగా ఉండి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘జై జనసేన – పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి’, మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో నిడదవోలు హోరెత్తింది.ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ జై జనసేన – పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

అంతకుముందు జనసేన ఉద్యమి లాగిన్ అయి సంబంధిత సందేశాన్ని మంత్రి దుర్గేష్ చదివి వినిపించారు .. జనసేన ఉద్యమ సభత్వం విజయవంతంగా నమోదైంది..అందుకు అభినందనలు.. మిమ్మల్ని మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం..సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పోరాటానికి మీ వంతు సాయాన్ని అందించేందుకు ఈ క్రింది లింకును క్లిక్ చేయండి అని చదువతూ మంత్రి దుర్గేష్ పోర్టల్ లో లాగిన్ అయ్యారు.అనంతరం జనసేన పోర్టల్ ను ఫోన్ ద్వారా పార్టీశ్రేణులకు చూపించారు.ఈ సందర్భంగా పట్టణంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ వీధి వ్యాపారులు, చిరువ్యాపారులు, దుకాణదారులకు వద్దకు స్వయంగా వెళ్లి ఆప్యాయంగా మాట్లాడి పార్టీ లక్ష్యాలు, ఆశయాలు వివరించి జనసేన సభ్యత్వాన్ని నమోదు చేశారు.75-100 మందికి లింకులు ఇవ్వాలన్న పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే 100కు పైగా లింకులు నిడదవోలు నియోజకవర్గంలో ఇచ్చామని తెలిపారు.

Scroll to Top
Share via
Copy link