తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గౌతమి సాల్వెంట్స్ అధినేత మల్లిన రామచంద్రరావు (93)గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం స్వగృహంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంతాపం తెలిపారు. పారిశ్రామికవేత్తగా ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన రామచంద్రరావు రొటరీ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. రామచంద్రరావు మృతికి సంతాపం తెలియజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


