గౌరీశ్వర స్వామి దేవస్థాన ప్రాకార పునర్నిర్మాణం ప్రారంభం 

ఉండ్రాజవరం మండలంలో మోర్త గ్రామంలో వేంచేసియున్న శ్రీ గౌరీశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణ పనులు భాగంగా శనివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ పురోహితులు యలమంచిలి సదాశివరాయలు ఆధ్వర్యంలో కంటిపూడి నరేంద్ర దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాకారం, కళ్యాణమండపం జీర్ణోద్ధారణ దశకు చేరడంతో పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు దేవస్థానం ప్రతిపాదిత కమిటి చైర్మన్ రాచమళ్ళ శ్రీను, గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంటిపూడి నరేంద్ర, అనపర్తి జలమయ్య, కంటిపూడి ప్రసాద్, కంటిపూడి నరేంద్ర, కరుటూరి చిట్టిబాబు, మద్దుకూరి రమేష్, అనపర్తి శ్రీను, కంటిపూడి రాంబాబు, వడ్డి కిషొర్, ఐసెట్టి విజయరాజు, కొప్పినీడి సత్యనారాయణ, వెలిగట్ల ప్రభువరం, ఎన్.సి.ఎస్కే.చౌదరి తదితరులు పాల్ల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link